Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నా జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం'.. అర్ధాంగి భువ‌నేశ్వ‌రికి సీఎం చంద్ర‌బాబు భావోద్వేగ బర్త్‌డే విషెస్

Nara Bhuvaneshwari birthday wishes from CM Chandrababu Naidu lucky to have her as partner
Advertisement
  • భార్య, తల్లి, వ్యాపారవేత్తగా ఆమె మా జీవితాల్లో వెలుగు నింపార‌ని కొనియాడిన సీఎం
  • భువ‌నేశ్వ‌రి దయ, కరుణ ఎందరికో ఆదర్శమని ప్ర‌శంస‌
  • నీలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించడం నా అదృష్టమంటూ పోస్ట్
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అర్ధాంగి నారా భువనేశ్వరికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. భువనేశ్వరిని తన జీవితంలో వెలుగుగా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించారు.

"భార్యగా, తల్లిగా, వ్యాపారవేత్తగా మా అందరి జీవితాల్లో వెలుగు నింపే భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "నీ దయ, కరుణ, సానుకూల దృక్పథం ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. నీ ఔదార్యంతో ఇతరులను ఉన్నత స్థానంలో నిలబెడతావు. నువ్వు చేపట్టే ప్రతి పాత్రకు అందాన్ని, ప్రయోజనాన్ని చేకూరుస్తావు" అని కొనియాడారు.

"నీలాంటి అద్భుతమైన వ్యక్తి నా జీవిత భాగస్వామిగా లభించడం నా అదృష్టం. నీ బలం, ఆప్యాయత, మరెన్నో విధాలుగా నువ్వు ప్రతిరోజూ మా జీవితాలను ప్రకాశవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని చంద్రబాబు త‌న పోస్టులో పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Advertisement
Advertisement
Nara Bhuvaneshwari
Chandrababu Naidu
Nara Bhuvaneshwari Birthday
Andhra Pradesh CM
Chandrababu Birthday Wishes
Nara Family

More Telugu News